తొమ్మిదోసారి ఇల్లెందు బరిలో గుమ్మడి..

1857
Gummadi-Narsaiah
- Advertisement -

గుమ్మడి నర్సయ్య…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ తరపున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తొమ్మిదోసారి ఇదే నియోజకవర్గం నుండి తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్దమయ్యారు.

నిస్వార్థపరుడిగా,నిరాడంబరుడిగా పేరు తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య…సర్పంచ్ స్ధాయి నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఇల్లెందు నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజానేతగా పేరుతెచ్చుకున్నారు.

Image result for gummadi narsaiah

సింగరేణి మండలం టేకులగూడేనికి చెందిన నర్సయ్య ఆ గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. 1983, 1985,1989 , 1999,2004లో ఐదు సార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో, 2009లో, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కోరం కనకయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. ఇటీవల గుండెపోటుతో అనారోగ్యం పాలైన నర్సయ్య తాజాగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతుండటం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది .

- Advertisement -