వండర్ గర్ల్..14 ఏళ్లకే ఐఏఎస్‌లకు ట్రైనింగ్..!

309
haryana
- Advertisement -

సాధారణంగా ఓ 8వ తరగతి లేదా 9 వ తరగతి పిల్లాడిని పెద్దయ్యాక నువ్వు ఏమవుతావ్ అంటే ఏం చెబుతారు…?నే పోలీస్,డాక్టర్,లాయర్‌నవుతా అని చెబుతారు. కానీ అదే వయసులో ఐఏఎస్‌లకు పాఠాలు చెబితే…ఏకంగా 10 భాషలు మాట్లాడితే ఆ చిన్నారిని వండర్ గార్ల్ అనే అంటాం. అవును వండర్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న హర్యానాకు చెందిన జాహ్నవి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

2003 నవంబర్ 8న జన్మించిన జాహ్నవి వయస్సు ప్రస్తుతం 16. హర్యానాలోని సమల్జా జిల్లాలోని ముల్పూర్ గ్రామంలో జన్మించిన జాహ్నవికి చిన్నప్పటి నుంచి భాషలు నేర్చుకోవడం పట్ల అమితాసక్తి ఆసక్తి. అందుకే తమ ప్రాంతానికి వచ్చే విదేశీ పర్యాటకుల నుండి వివిధ దేశాల భాషలను నేర్చుకుంది.

ఫలితంగా తొమ్మిది సంవత్సరాల వయసులోనే ‘వండర్‌ గర్ల్‌‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డు సొంతం చేసుకుంది. కేవలం తన చదువులోనే కాదు.. జాహ్నవి పాటలు అద్భుతంగా పాడుతుంది. 10 భాషల్లో ఫ్రెంచ్‌, జపనీస్‌‌, ఇంగ్లిష్‌, హిందీతో పాటు ఆరు భాషల్లో పట్టు సాధించింది.

13 ఏళ్ల వయస్సులోనే 12 తరగతి పరీక్షలు రాసి ఊత్తీర్ణత సాధించి ..చిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించిన బాల మేధావిగా జహ్నవి గుర్తింపు సాధించింది. 14 ఏళ్ల వయస్సులో నుండే జాహ్నవి ఐఏఎస్‌ అధికారులకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతోంది. అంతేకాదు… సోష‌ల్ మీడియా ద్వారా ఇంగ్లిషు పాఠాలు కూడా నేర్పించే జాహ్నవి ఎప్పటైనా ఐఏఎస్ కావాలనేదే తన లక్ష్యమని చెబుతోంది.

- Advertisement -