కాంగ్రెస్ వల్లే నల్గొండ నాశనమైంది: మంత్రి జగదీష్

255
Minister Jagadish Reddy
- Advertisement -

నల్గొండ జిల్లా: హాలియలో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సదస్సు. నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరసింహమయ్య, ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాం చందర్ నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సదస్సు అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిన్న కాంగ్రెస్ నేతల జలదీక్షలు, ధర్నాలు నక్కల సంతాప సభల్లా ఉన్నాయన్నారు. రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ నాయకులు. సంతోషకరమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ధర్నాలు చేసి,దీక్షలు చేసి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ద్రోహుగా మిగిలారు. నల్గొండ రైతులు నాశనం అయ్యింది కాంగ్రెస్ నాయకుల చేతకానితనం వల్లనే అని మంత్రి విమర్శించారు.

ఇక పోతిరెడ్డిపాడు పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకులదే. పదవుల కోసం సీమాంధ్ర నాయకులకు అమ్ముడుపోయిన నీచ చరిత్ర కాంగ్రెస్ నాయకులది. జానారెడ్డి, ఉత్తమ్,కోమటిరెడ్డిలు అందరూ సీమాంధ్ర నాయకుల వద్ద మొకరిల్లి నల్గొండ జిల్లాను ఎండబెట్టారు.కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దొంగ దీక్షలు, డ్రామాలు,ధర్నాలు ప్రజలెవ్వరు నమ్మడం లేదని జగదీష్‌రెడ్డి ఎద్దేవ చేశారు.

సాగర్ ఎడమ కాలువ కింద మొదటి మేజర్ రాజవారం మేజర్ కింద చివరి భూములకు నీళ్లు ఇవ్వలేని చేతకాని వారు కాంగ్రెస్ నేతలు.SLBC ప్రాజెక్ట్ పాపం కాంగ్రెస్ నాయకులదే. ఎక్కడ లేని,వాడని TBM టన్నెల్ మిషిన్‌ని తెచ్చి SLBC సొరంగం తొవ్వడానికి పెట్టి ప్రాజెక్ట్ పూర్తి అవ్వకుండా కుట్ర చేసింది కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులు ద్వంద వైఖరి ని విడనాడాలి అని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

- Advertisement -