రాజ్యసభకు హరివంశ్ నారాయణ్ సింగ్‌

6
- Advertisement -

రాజ్యసభకు ప్రముఖ రాజకీయ నాయకుడు హరివంశ్ నారాయణ్ సింగ్‌ను నామినేట్ చేశారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ నిర్ణయం కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

రాజ్యసభలో ఖాళీ అయిన ఒక నామినేటెడ్ సభ్యుడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ నియామకం జరిగింది. మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ పదవీ విరమణతో ఆ సీటు ఖాళీ కావడంతో, ఆ స్థానంలో హరివంశ్‌ను నియమించారు.

ఈ నియామకం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారం, సాహిత్యం, విజ్ఞానం, కళలు, సామాజిక సేవల వంటి రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే అధికారం కలిగి ఉంటారు.

హరివంశ్ నారాయణ్ సింగ్ ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ఆయన రాజ్యసభ ఉపసభాపతిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్లమెంట్ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.

జర్నలిజం రంగంలో కూడా ఆయనకు విశేష అనుభవం ఉంది. ఇటీవల ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో, మళ్లీ రాజ్యసభలో కొనసాగుతారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రాష్ట్రపతి నామినేషన్‌తో ఆ అనుమానాలకు తెరపడింది.

Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం

- Advertisement -