పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా …బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప పత్రం’ను విడుదల చేశారు. కోల్‌కతాలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన పలు కీలక హామీలు ఇచ్చారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో Uniform Civil Code (యూసీసీ) అమలు చేస్తామని అమిత్ షా తెలిపారు.
అలాగే మహిళలకు ప్రతి నెల ₹3,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
చొరబాటుదారులపై జీరో టాలరెన్స్ విధానం
45 రోజుల్లో 7వ వేతన కమిషన్ అమలు
నిరుద్యోగ యువతకు నెలకు ₹3,000 భృతి
అయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాల అమలు
రాష్ట్రంలో చట్టవ్యవస్థను బలోపేతం చేయడం
సరిహద్దు భద్రతకు ప్రాధాన్యత
మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్
బెంగాల్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు ‘వందే మాతరం మ్యూజియం’ ఏర్పాటు
Also Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం
నకిలీ హామీలు, చొరబాటుదారులతో సంబంధాల వల్లే టీఎంసీ వరుసగా మూడు సార్లు గెలిచిందని ఆరోపించారు. ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

