Harishrao:సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభ

63
- Advertisement -

సిద్దిపేటలో 17న జరిగే సీఎం కేసీఆర్ ప్రగతి – ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో సభ ప్రాంగణాలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రం సాధించి, స్వరాష్ట్రంలో ప్రగతిని పరుగులు పెట్టించి అభివృద్ధికి చిరునామాగా నిలిచిన సీఎం కేసీఆర్ రాక కోసం సిద్దిపేట గడ్డ ఎదురు చూస్తుందని తెలిపారు హరీష్. మళ్లీ నిలుస్తుంది తెలంగాణ మీ వెంట అని తెలిపారు.

సీఎం కేసీఆర్ సభకు జనసమీకరణ, సభా సమాయత్తంపై పార్టీ శ్రేణులకు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు హరీష్. సిద్దిపేట నాటి ఉద్యమానికి, నేటి అభివృద్ధికి దిక్సూచి అని… నేడు సిద్దిపేట జిల్లాకు.. గోదావరి జలాలతో సాగు నీటి కల, రైలు కలలు నెరవేరాయ్ అన్నారు. నాడు నినాదాలుగా ఉన్న పనులను నేడు నిజం చేసి పురిటి గడ్డను పునీతం చేసిన కారణజన్ముడు మన సీఎం కేసీఆర్ ద్దిపేట కు 17 న వస్తున్న సందర్భంగా లక్ష మందితో ‘ప్రగతి – ప్రజా ఆశీర్వాద సభ‘ నిర్వహించి అపూర్వ స్వాగతం పలుకుదాం అని పిలుపునిచ్చారు.

Also Read:CM KCR:16 రోజుల షెడ్యూల్ రిలీజ్

- Advertisement -