CM KCR:16 రోజుల షెడ్యూల్ రిలీజ్

45
- Advertisement -

సీఎం కేసీఆర్ నియోజకవర్గాల టూర్ ఖరారైంది. 16 రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఈనెల 15 వ తేదీన హుస్నాబాద్ తో మొదలయ్యే తొలిదశ ప్రచార పర్వం నవంబర్ 8 వ తేదీన బెల్లంపల్లిలో ముగుస్తుంది. ప్రతిచోటా సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం. ఒక్కోరోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటన, బహిరంగ సభలు ఉండనున్నాయి.

40 నియోజకవర్గాల్లో తొలి విడత ప్రచారం నిర్వహించనున్నారు సీఎం. ఇప్పటికే అసెంబ్లీ బరిలో దిగే అభ్యర్థులను ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత. ఎమ్మెల్యేల మొదటి దశ ప్రచారపర్వం ఇప్పటికే ముగిసింది.అటు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సైతం రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.ఇప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా బరిలోకి దిగి ప్రచార పర్వం మొదలు పెడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల జోరు ఊపందుకోనుంది.

కనీసం వేరే రాజకీయ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని పరిస్థితి ఉండగా వాళ్లు ఒకడుగు వేసేలోపే బీఆర్ఎస్ వంద అడుగులు వేసే పరిస్థితిలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కనుంది. నవంబర్ 9 తేదీ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేస్తారు. తరవాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య కామారెడ్డిలో సీఎం తన రెండో నామినేషన్ వేస్తారు. సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

- Advertisement -