Harishrao:యోగా జీవనవిధానం కావాలి

40
- Advertisement -

యోగాను ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మాట్లాడిన హరీశ్… యోగాతో అన్ని రకాల వ్యాధుల కు చెక్ పెట్టవచ్చు అన్నారు. ఈ మధ్య కాలంలో బీపీ షుగర్ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి.. ఆరోగ్యం కాపాడుకోవాలి … ఆరోగ్యం కోసం యోగా అన్నారు.

ఖర్చు లేని పని యోగా సాధన….అందరం ఎంతో బిజీగా ఉన్నామని ఆరోగ్యాన్ని నిర్లక్షం చేస్తున్నాము… ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు యోగ ఆసనాలు ప్రాణాయామం నేర్పిస్తున్నామన్నారు.

మెడికల్ కాలేజీలో యోగాను ఒక భాగంగా చేశామని..పిల్లలకు యోగా ఏకాగ్రతను పెంచుతుందన్నారు. మన యోగ ప్రపంచ దేశాల లో చేస్తున్నారని… ప్రపంచం యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని పొందిందన్నారు. ఆరోగ్య తెలంగాణ అంటే గొప్ప వైద్య సేవలు అందించడం కాదు.రోగం రాకుండా కాపాడుకోవాలన్నారు. 7.4 గ్రీన్ కవర్ తో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ ఉందని… ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం కాలుష్యాన్ని తగ్గించడానికి అన్ని స్థాయిలలో అమలుచేస్తుందన్నారు.

Also Read:జయశంకర్ సార్…యాదిలో

క్యాన్సర్ పేషంట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ వారు ఆ వ్యాధిని అధిగమిస్తున్నా రని… ఆరోగ్యమే మహాభాగ్యము అనే సామెత ఊరికే రాలేదన్నారు. ఆరోగ్యం కాపాడుకోవాలి లేక పోతే బీపీ, సుగర్ లాంటి వ్యాధులు మనిషిని క్రమంగా పడుచేస్తుందన్నారు. సిద్దిపేట అనేక రంగాలలో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది ఆరోగ్యం లో కూడా మనం ముందుండాలన్నారు. ప్రతీ లీడర్ తమ తమ గల్లీలో యోగా చేపించాలని….చేసే ప్రతి వ్యక్తికి మ్యాట్ ఇస్తానని చెప్పారు. అందరం కలిసి ఆరోగ్య సిద్దిపేటను సాధిద్దాం అన్నారు.

- Advertisement -