Yoga Day:అంతర్జాతీయ యోగా దినోత్సవం..

194
yoga
- Advertisement -

ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాలలో యోగా ఒకటి.. మానవ మానసిక, శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సూచనతో జూన్​ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015లో ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. అప్పటినుంచి ఏటా యోగా డేను ప్రపంచదేశాలు ఘనంగా జరుపుకుంటున్నాయి.

మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగా ఒకటి. వేదకాలం నుంచి ఆదికాలం వరకు సనాతన భారత సంప్రదాయంలోనే ఇమిడి ఉంది యోగా సాధన. పూర్వీకులు శారీరక, మానసికోల్లాసానికి యోగా ఆచరించారు.

Also Read:జయశంకర్ సార్…యాదిలో

ప్రాచీనకాలంలో ఎందరో మునులు, యతులు, రుషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ఆసనాలు, ఆచరించిన శ్వాస సంబంధిత ప్రాణాయామాలు ఇప్పుడు ‘యోగా’ పాఠాలుగా మారాయి. మానసిక సమస్యలకు పరిష్కారం, శారీరక రుగ్మతలకు సమాధానం, అధ్మాత్మికానుభూతికి ఆలవాలం యోగానే. జీవనశైలిలో ఎన్ని హైటెక్ వసతులు, పోకడలు భాగమైనా ప్రాచీన యోగా పద్ధతులతోనే ఫలితాలు సాధిస్తున్నారు చాలా మంది.

Also Read:అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు..

- Advertisement -