ఇంత మోసమా.. ఆరు గ్యారెంటీల్లో 13 హామీలు !

19
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన ఆరు గ్యారెంటీల విషయంలో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మరో రెండు గ్యారెంటీల అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష బి‌ఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరు గ్యారెంటీలలో మొత్తం 13 హామీలను కాంగ్రెస్ ప్రకటించిందని, అందులో రెండు హామీలను మాత్రమే అమలు చేసి రెండు గ్యారెంటీలను అమలు చేసినట్లు కాంగ్రెస్ మబ్యపెడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. .

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంలో రెండు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసినట్లు కాంగ్రెస్ సర్కార్ చెప్పించడం ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమే అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అమలులో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆరు గ్యారెంటీలలో భాగమైన మహాలక్ష్మి పథకంలో భాగమని, ఇంకా ఇందులో 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 వంటగ్యాస్ వంటి హామీలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇవన్నీ అమలైనప్పుడే ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీని అమలు చేసినట్లు అని హరీష్ రావు అన్నారు. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయని వాటన్నిటిని అమలు చేసినప్పుడే ఆరు గ్యారెంటీలు అమలైనట్లు అని బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. మరి ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ పై ప్రజలు కూడా అసహనం కనబరుస్తున్నారు.

Also Read:మెగ్నీషియం లోపిస్తే.. ఇన్ని సమస్యలా?

- Advertisement -