Harishrao: జాబ్ క్యాలెండర్‌ జోక్‌గా మారింది

6
- Advertisement -

జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్‌గా మారిపోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నేటి క్యాలెండర్‌ బోగస్‌గా మారిందని మండిపడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరసనలు తెలిపారు.

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలిస్తామని అశోక్‌నగర్‌లో రాహుల్‌గాంధీ చెప్పలేదా అని గుర్తుచేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 8 నెలలు గడిచిపోయింది.. ఇంకా నాలుగు నెలలు మిగిలిందని తెలిపారు.. ఏదో జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తారంటే.. నిజంగానే రెండు లక్షల ఉద్యోగాలిస్తారేమో అనుకున్నామన్నారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు చూపించి, అసలు ఎన్ని జాబ్‌లు ఇస్తారో లెక్క చెప్పకుండా ఓ డ్రామా ఆడిందని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

దగా చేసిన కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలోని నిరుద్యోగులు అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. కౌరవుల సభలాగా, మందబలం ఉందని.. అధికారం ఉన్నదని, మార్షల్స్‌, పోలీసులను పెట్టుకుని మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా నిరుద్యోగులు, బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు వెంటపడరని స్పష్టం చేశారు.

Also Read:తెలంగాణ జాబ్ క్యాలెండర్ రిలీజ్..

- Advertisement -