Harish:ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్‌ను గెలిపించండి

13
- Advertisement -

ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్‌ను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి,ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,ఎర్రోళ్ల శ్రీనివాస్,మాణిక్యం,ఫారూఖ్ హుస్సేన్,తిరుపతి రెడ్డి,ఏకే. గంగాధర్ రావ్ ,శశిధర్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు హరీష్.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలువాల్సిన అవసరం ఉందని… రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేఆరని,బీజేపీ నలుగురు ఎంపీ లు ఏనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం,హక్కులు కాపాడటం బీఆర్ఎస్ ఎజెండా అని,14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు.

10 ఏండ్లు తెలంగాణ ను కేసీఆర్ అభివృద్ధి చేశారని,కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేస్తే కాంగ్రెస్ దండగ చేస్తోందన్నారు. పంటలు ఎండిన సీఎం కు పట్టదని,రైతుల కష్టాలు రేవంత్ కు పట్టవన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, రేవంత్ ది బూతుల పాలన కాదు బూటకపు పాలన అన్నారు. అబద్ధాల పాలన చూసి ఓటేస్తే,ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను,ఎంపిలను తీసుకుంటూ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.

రెండు లక్షల రూపాయల రుణ మాఫీ జరిగిన వారంతా కాంగ్రెస్ కు ఓటెయ్యండి..రాని వారు బిఆర్ఎస్ కు ఓటేయాలన్నారు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కంగనే అన్ని మర్చిపోయిండు…నాలుగు వేల పెన్షన్ రానోళ్లు బిఆర్ఎస్ కు ఓటేయండి..ఇస్తే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు.ప్రతి మహిళకు రూ 2500 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు,కాంగ్రెస్ పార్టీ రైతులను,మహిళలను,వృద్ధులను మోసం చేసిందన్నారు. నాలుగు నెలల్లో 140 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు,38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ,20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు.

బిఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ,రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీ మినిస్టర్ లేడన్నారు. బీజేపీ తో దోస్తాన్ ఎవరో..శత్రువు ఎవరో ప్రజలు ఆలోచించాలన్నారు.కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ కి వేసినట్టే,పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.

Also Read:Errabelli:తప్పుడు వార్తలు రాయకండి

- Advertisement -