నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీష్.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడ బాధాకరమన్నారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఒట్టి డొల్ల అని మండిపడ్డారు.
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 3 నెలల పెండింగ్ జీతంతో పాటు, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్.
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరం.
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో…
— Harish Rao Thanneeru (@BRSHarish) May 30, 2024
Also Read:మరో 5 రోజులు హీట్ వేవ్!