కేరళకు సాయం.. విరాళం ప్రకటించిన కేటీఆర్, హరీష్

225
ktr-harish-rao
- Advertisement -

భారీ వర్షాలు, వరదలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేరళలో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. నీటిపై తేలుతున్న మృతదేహాలు, నదులను తలపిస్తున్న గ్రామాలు, గూడు చెదిరిన లక్షలాది మంది ప్రజలు, తెగిపోయిన రోడ్లు, సహాయ కేంద్రాల్లో పట్టెడన్నం కోసం ఎదురు చూస్తున్న జనాలు, ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళలో పరిస్థితి.

Kerala-floods

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ రాష్ట్రం గజగజ వణుకుతోంది. ఇప్పటికే ప్రాణాలు వరదల దాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ రాష్ట్రంలో ఇప్పటికే 11 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. వర్షాల ధాటికి కొండచరియలు విరిగి పడుతుండడంతో వేలాది మందిని సహాయ శిబిరాలకు తరలించారు. వరదల ప్రకోపానికి అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు తమ వంతు సాయంగా ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.

kerala-flood

రాష్ట్రమంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి తమ ఒక నెల జీతాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపుతామని తెలిపారు. మంత్రులతో పాటు ఇరిగేషన్ ఇంజినీర్లు కూడా కేరళ నిరాశ్రయులకు సాయమందించేందుకు ముందుకొచ్చారు. కేరళకు అన్ని విధాలుగా తెలంగాణ అండగా ఉంటుందని మంత్రులు తెలిపారు. తోటి ఎమ్మెల్యేలు కూడా తమ వంతు సాయంగా ఎంతో కొంత కేరళకు సాయం చేయాలని కోరుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఇంజినీర్లు కూడా తమ వంతు సాయంగా ఒక రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించడంపై మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. వరద భాధితులుకు అండగా నిలబడదాం అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.

- Advertisement -