రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం..

189
Minister Harish Rao
- Advertisement -

సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మనిక్ రావు, మదన్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీసీ రోడ్లు వేయడమే సేవ కాదు, రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడం కూడా సేవే అన్నారు.

ప్రతి ఒక్కరికీ రైతు బంధు అందించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం. రైతులు విత్తనాలతో పాటు, ఎరువులు కూడా కొనుక్కోవాలి. ప్రతి సంవత్సరం 70 వేల కోట్లు రైతు సంక్షేమం కోసమే ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు.

నియంత్రిత సాగు అనే దాని కంటే.. ప్రాధన్యత పంటల సాగు అని అంటే బాగుంటుంది. మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతు భీమాకు1200 కోట్లు,రైతు బంధుకు 14వేల కోట్లు,ఉచిత కరెంట్ కు10వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా రైతు సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 70 వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటమని..ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు మంత్రి హరీష్‌.

- Advertisement -