ఈసారి ఇంట్లోనే బోనాలు: మంత్రి తలసాని

58
Minister Talasani

జీహెచ్ఎంసీలో కరోనా ఉదృతి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఏడాది బోనాల పండుగను రద్దు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం బోనాల పండుగ నిర్వహణపై నగర మంత్రులు సమీక్ష నిర్వహించారు.

అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆలయాల్లో పూజరులు మాత్రమే బోనాలు నిర్వహిస్తారని.. ప్రజలు మాత్రం ఎవరి ఇంట్లో వారే బోనాలు జరుపుకోవాలని తెలిపారు. గటాల ఊరేగింపు కూడా పూజారులే దేవాలయ పరిసరాల్లో ఉరేగిస్తారని అన్నారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు కూడా పూజరులే సమర్పిస్తారన్నారు. ఇందుకు గ్రేటర్ ప్రజలు సహకరించాలని కోరుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.