మంజీరా నదిపై చెక్‌డ్యాం నిర్మాణం: హరీష్‌ రావు

323
harish
- Advertisement -

మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణం కల త్వరలో నెరవేరనుందని తెలిపారు మంత్రి హరీష్ రావు. హవెలి ఘన్‌పూర్‌ మండలం సర్దన గ్రామంలో మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన హరీష్…మెదక్‌ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయని తెలిపారు.

సమైక్య పాలకుల కుట్రల వల్లే మంజీరాపై చెక్‌ డ్యామ్‌ నిర్మించడం సాధ్యం కాలేదన్న హరీష్…కేసీఆర్‌ రైతుబిడ్డ అయినందునే ఈ కల నేరవేరుతుందని తెలిపారు.

ఈ డ్యామ్‌ ఐదు గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజీరా నదిపై దాదాపు 15 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించుకున్నామని మంత్రి గుర్తు చేశారు. కొండపోచమ్మ సాగర్‌కు నీరు వచ్చిన వెంటనే హల్దీ ద్వారా బొల్లారం మత్తడికి వస్తాయి. అక్కడి నుంచి సర్దన చెక్‌డ్యామ్‌, కూచనపల్లి చెక్‌డ్యామ్‌కు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు హరీష్ రావు.

- Advertisement -