ఎన్నో ఏండ్ల పేదల కల నెరవేరి నందు కు నాకు సంతోషంగా ఉంది. మీ పెదవుల మీద ఆనందం చూస్తే బిర్యానీ తిన్న ఆనందం నాకు కలిగింది. మీరే నా కుటుంబం.. నేను మీ కుటుంబ సభ్యు డి నీ..పెద్దల గేటెడ్ కమ్యూనిటీ ఇండ్ల మాదిరి అన్ని సౌకర్యాలుతో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్లను గూడు లేని అసలైన గరీబొల్లకే కేటాయించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.సోమవారం సిద్దిపేట కేసిఆర్ నగర్ ఆడిటోరియం లో 8వ వార్డు నర్సా పూర్ కాలనీలో మూడో దఫా 216 మంది డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు సతీ సమేతంగా పట్టాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు.
నిరుపేదల స్వంతింటి కలను నిజం కాబోతున్న అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో… నర్సాపూర్లో 2460 రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం సకల సౌకర్యాలతో ప్రైవేట్ ఇండ్ల సముదాయాలకు ధీటుగా పూర్తి చేశామన్నారు. ఈ ఇళ్ళు నిర్మించేందుకు మాకు నాలుగేళ్ల సమయం పట్టిందని మంత్రి తెలిపారు. ఈ నాలుగేళ్లలో నాలుగు వందల సార్లు జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లతో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించి స్వంత ఇంటి మాదిరి మనసు పెట్టీ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు.
మొదటి దశలో 1341 మంది లబ్ధిదారులను గుర్తించామనీ మంత్రి తెలిపారు. నిజమైన పేదలకు ఇల్లు దక్కాలని ఆరు నెలలు కష్టపడి జల్లెడ పట్టి ఏలాంటి ఆరోపణలకు తావులేకుండా పేదరికమే ప్రామాణికం గా అర్హులను మాత్రమే ఎంపిక చేశామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని బాజప్తా వార్డు గోడల పై లబ్దిదారుల జాబితా ప్రదర్శించసమన్నారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా అధికారులతో సహా 200కు పైగా అధికారులు అహర్నిశలు శ్రమించారని మంత్రి గుర్తు చేశారు. కేటాయింపు రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్త లు తీసుకున్నామన్నారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు స్థానిక కౌన్సిలర్ లు సహకరించాలన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ఒక్క పైసా లంచం లేకుండా ఇండ్ల కేటాయింపు జరిపామన్నారు. ఎవరైనా ఒక్క పైసా లంచం ఇచ్చినట్టు చెప్పండి.. వారికి రూ.10 వేల బహుమానం ఇస్తానని మంత్రి తెలిపారు. ప్రతిగా లబ్దిదారులు స్పందిస్తూ తమను ఎవ్వరూ ఒక్క పైసా లంచం అడగలేదని తెలిపారు.
మంత్రి హరీష్ రావు తన ప్రసంగం ను కొనసాగిస్తూ..తోలి దశలో ముఖ్యమంత్రి సమక్షంలో 144 మంది లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేశారన్నారు. రెండో దశలో 180 మందికి పట్టాలు పంపిణీ చేశామన్నారు. ప్రతీ ఇంట్లో గృహ విద్యుత్, నల్లా, గ్యాస్ కనెక్షన్, పైపులు అన్ని సక్రమంగా పని చేస్తున్నా యో లేదో సరి చూసుకుంటూ దశల వారీగా లబ్ధిదారుల కు పట్టాలు అందిస్తూ గృహ ప్రవేశాలు జరిగేలా చూస్తున్నా మన్నారు. ఇంకా మిగిలిన 1000 ఇండ్లకు సంబంధించి పున: పరిశీలన ప్రక్రియ జరుగుతుందని వారిలో అర్హులైన వారికి త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగకూడదన్న ధ్యేయంతో సాంకేతికత దన్నుగా బిగ్ డేటాతో సరిపోల్చు తూ…అర్హులకే మాత్రమే లబ్ది పొందేలా చూస్తున్నా మన్నారు.మరో 1000 ఇండ్లు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేయగా వెంటనే మంజూరు చేశారన్నారు.
జోర్డార్ వసతులతో…. నయా పైసా ఖర్చు లేకుండా..
బహిరంగ విపణిలో రూ.15 లక్షలు విలువ చేసే డబుల్ బెడ్ రూం ఇండ్లను సకల సౌకర్యాలతో పేదలకు ఉచితంగా అందిస్తున్నా మన్నారు.లబ్ధిదారులకు పట్టాలు అందజేసే సమయంలో నే…. పట్టా ఉత్తర్వు తో పాటు..నల్లా కనెక్షన్ మంజూరు పత్రం, కరెంట్ కనెక్షన్ , ఇంటి నెంబర్, పైపుడ్ గ్యాస్ కనెక్షన్ లు అందజే స్తున్నా మన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ తో కేసిఆర్ నగర్ ను అనుసంధానం చేశామన్నారు. ఫలితంగా ఉపరితల మురుగు కాల్వలు ఉండవన్నారు. దోమలు, పందుల బెడద తప్పి..అనారోగ్యం దరిచేరదన్నారు. అంతే కాకుండా స్వంత అన్నయ్య లా ఆశీర్వదిస్తూ…నూతన వస్త్రాలు బహుకరించి గృహ ప్రవేశాలు చేపిస్తున్నామన్నారు.కేటాయించిన పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడు కోవాల్సిన బాధ్యతల లబ్ధిదారుల దేనన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా నేరమని తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజల విజ్ఞప్తి మేరకు కేసిఆర్ నగర్ కు ప్రతి రోజు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రతీ రోజూ… కేసిఆర్ నగర్ నుంచి కోటి లింగాలు, కా లకుంట వరకు 4 ట్రిప్పులు తిప్పుతున్నారు మాన్నారు. రూ. 25 లక్షలతో పోలీస్ పోస్ట్ కూడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే కేసిఆర్ నగర్ కు బస్తీ దవాఖానా వచ్చే వరకు ఒక ఏఎన్‌ఎం, ఆశ వర్కర్ తో తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేశా మన్నారు. వీటితో పాటు త్వరలోనే కేసిఆర్ నగర్ కు బడి, రేషన్ షాప్, గుడి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. లబ్దిదారులు గృహ సముదాయంలో పరిశుభ్రత కు పెద్ద పీట వేయాలన్నారు.
కలెక్టర్ శ్రీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేట నడిబొడ్డున నాణ్యతతో 2460 రెండు పడక గదుల ఇల్లు నిర్వహించామన్నారు మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధతో దేశంలో మరెక్కడా లేని విధంగా చూడని విధంగా ఇళ్ల నిర్మాణం చేశామన్నారు. తనకు తెలిసి దేశంలోని 718 జిల్లాలలో ఎక్కడా ఎక్కడ ఇలాంటి గృహాలు నిర్మించిన దాఖలాలు లేవని కలెక్టర్ అన్నారు. అలాంటి ఇల్లు ఇక్కడ నిర్మించడం, వాటిని పొందిన లబ్దిదారుల కుటుంబాలు అదృష్ట వంతులు అన్నారు.
అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారుల బృందాలు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ప్రతి శ్రమించి 11,506 దరఖాస్తులను జల్లెడ పట్టి లబ్దిదారుల ఎంపిక చేశామన్నారు. ఇళ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు మంత్రి ఆదేశాల మేరకు ప్రజావేదికలో ఇళ్ల కేటాయింపు జరిపామని అన్నారు. గూడు లేని నిరుపేదలు అయి ఉండి ఇండ్లు రాని కుటుంబాలు నిరాశ చెందవద్దని మంత్రి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరో వెయ్యి సిద్దిపేటకు మంజూరు చేశారని అన్నారు. త్వరలోనే వాటి నిర్మాణాన్ని ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేసి మిగిలిన అర్హులకు కేటాయిస్తామన్నారు.
కలెక్టర్ పై ప్రశంసల జల్లు… సన్మానం
కెసిఆర్ నగర్‌లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయడంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి కృషి అనన్యసామాన్యమైన దని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. గృహ సముదాయం అందంగా రావడంలో ఇళ్ల నిర్మాణం క్వాలిటీతో పూర్తి చేయడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవే కారణమన్నారు. రెండు పడక గదుల ఇల్లు కేటాయింపులో అత్యంత పారదర్శకంగా జరిగేలా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద చూపారని ప్రశంసించారు. ఇండ్లు త్వరగా అందించాలని తాను ఎన్నో సార్లు ఒత్తిడి చేశానని అన్నారు. అయినప్పటికీ ఓపిగ్గా నిజాయితీగా పనిచేసి ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చూశారని తెలిపారు. ఒక మంచి కలెక్టర్, ఎమ్మెల్యే ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందో దాని ఫలితం మీరు చూస్తున్నారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను శాలువా, ప్రత్యేక జ్ఞాపికతో మంత్రి సత్కరించారు.
అనంతరం మంత్రి డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల కుటుంబం సభ్యులకు మంత్రి హరీష్ రావు సతీ సమేతంగా ఇండ్ల పట్టాలు, నూతన వస్త్రాల బహుకరించారు.కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్,ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సీనియర్ ఫ్యా కల్టీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఉషారాణి,మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ శ్రీ అక్తర్ పటేల్, AMC చైర్మన్ శ్రీ పాల సాయి రాం, RDO శ్రీ జయ చంద్రా రెడ్డి , SUDA వైస్ చైర్మన్ శ్రీ రమణ చారి , మున్సిపల్ కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట కెసిఆర్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలనకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సోమవారం వచ్చారు. ఇండ్లు ఎలా నిర్మించారు.. మౌలిక సదుపాయాల కల్పన ఎలా చేశారు. ఇండ్ల కేటాయింపు ఎలా జరిపారు ..అన్న వివరాలను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ని ఆయన అడిగి తెలుసుకున్నారు.సిద్దిపేట కెసీఆర్ నగర్ లో గృహ సముదాయం చూడ చక్కగా ఉందన్నారు.సిద్దిపేట మాదిరే జగిత్యాలలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టి అందిస్తామన్నారు.