మొక్కలు నాటిన రాజన్న సిరిసిల్ల జెడ్పీచైర్ పర్సన్..

106
Rajanna Sircilla ZP Chairman

ఈ రోజు జన్మదినం సందర్భంగా సిరిసిల్ల జెడ్పి క్యాంపు కార్యాలయం వద్ద మొక్కలు నాటారు రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. ఈ సందర్భంగా అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగింది …

చాలా రోజుల నుండి ప్రకృతిని కాపాడాలని మొక్కలు పెంచాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్‌కు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పకృతి అని మనం చుట్టూ ఉన్న చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నవి అని ఈరోజు నాటిన ఈ మొక్కలు కూడా వాటి లాగ మహా వృక్షాలుగా కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

ఇప్పటికే మనం చాలా వాతావరణ కాలుష్యానికి గురవుతున్నామని ఢిల్లీ, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చాలా వాతావరణ కాలుష్యం పెరిగి పోయిందని అలాంటి పరిస్థితి రావద్దంటే ప్రతి ఒక్కరు వారి ఇంటి ముందు ఒక మొక్కను నాటుకునే విధంగా శ్రద్ధ తీసుకోవాలని కోరారు. సంతోష్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో బోయిన్‌పెళ్లి జెడ్పీటీసీ ఉమా కొండయ్య పాల్గొన్నారు.