కాంగ్రెస్, బిజెపి నుండి టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు..

117
koppula

సోమవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో పెగడపల్లి, ఆరవెల్లి గ్రామాల నుండి కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి 50 మంది యూత్ సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీ చేరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం జరిగింది. వారికి మంత్రి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి జరగాలంటే దేశంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఆర్థిక వృద్ధి రేటు పెరిగి సంక్షేమం బ్రహ్మాండంగా చేయవచ్చు. 2014 కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 శాతం వృద్ధి రేటు 5 శాతంకు దిగజారిందని మంత్రి ఎద్దేవ చేశారు.

కొత్త ప్రాజెక్టులు, విద్యార్థులకు రైతులకు ఎస్సీ లకు ఎస్టి లకు, ఎలాంటి అభివృద్ధి పథకాలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇచ్చారా జన్ ధన్ ఖాతాలో ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తామన్నారు. వేశారా. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి దాదాపు 400 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. దేశంలో బిజెపి పాలిత ప్రాంతాలలో ఎక్కడైనా కేసీఆర్ కిట్టు గాని రైతు బీమా గాని, అమల్లో ఉన్నాయా అని మంత్రి ప్రశ్నించారు.