సిద్ధిపేట జిల్లాలోని కొండభూదేవి గార్డెన్‌లో స్వచ్ఛ,ఆరోగ్య సిద్ధిపేటపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రి హరీష్ రావు ముఖ్య అథితిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. శుచి,శుభ్రత పాటిస్తే హోటల్ వ్యాపారం మెరుగవుతుంది. సిద్ధిపేట పొన్నాల దాబాలు చాలా ఫెమస్..శుభ్రమైన ఆహారం ఇచ్చి ఆ పేరును కాపాడండి.. ప్రజలు డబ్బుకంటే శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారని మంత్రి అన్నారు.
హోటల్ వ్యాపారం ఎంత ముఖ్యమో..ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసే విధానం మానుకోవాలి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలుతోంది. సిద్దిపేటలో సుమారు 2 లక్షల మంది వివిధ పనులపై పట్టణానికి వస్తున్నారు. మెడికల్ కళాశాలకు వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు వస్తున్నారు. వారు సరదాకోసం హోటల్‌కు వస్తుంటారు. సిద్ధిపేట త్వరలో మరింత విస్తరిస్తోంది. వ్యాపారాలు పెరుగుతున్నయి. హోటళ్లు,పాన్ షాప్‌లు,స్వీట్ షాప్‌లు,గప్ చుప్ బండ్లు ఖచ్చితంగా శుభ్రత పాటించాలని హరీష్‌రావు తెలిపారు.
ప్రతి చోటా చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి..వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్లపై పడవేయవద్దు. సిద్ధిపేటలోని 7 వందల తినుబండారాల దుకాణాల యజమానులకు,అందులో పనిచేసే కార్మికులు 2000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శిక్షణ ఇప్పించి.. శుభ్రత పాటించే పరికరాల కిట్‌ను ఉచితంగా అందిస్తాం..శుభ్రత పాటించని హోటళ్లపై,గప్ చుప్ బండ్లు,స్వీట్ షాప్‌ల వారికి 5 సార్లు నోటీసు ఇప్పించిన తరువాత ఫైన్ వెయిస్తామని మంత్రి వివరించారు.
ఎవరూ ఫైన్ కట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు.. కొంత ఎక్కువ ఖర్చు అయినా నాణ్యత పాటించాలి.హోటళ్లలో ,స్వీట్ షాపు ల్లో వాడిన నూనెలను మళ్లీ వాడవద్దు. వాడిన నూనె మళ్లీ వాడితే అవి తిన్న వారికి తొందరగా క్యాన్సర్ వ్యాధి వస్తుంది. డబ్బులిచ్చి క్యాన్సర్ వ్యాధిని కొనుక్కునే పరిస్థితి తేవద్దు. ప్రజల ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయండి. హోటల్ లను పరీశీలించి వారికి గ్రీన్,ఎల్లో,రెడ్ సర్టిఫికెట్లు ఇస్తాం. గ్రీన్ సర్టిఫికెట్ ఉన్న వారివద్దే ప్రజలు తినాలని మున్సిపాలిటీ ద్వారా ప్రచారం చేస్తామని మంత్రి హరీష్ తెలియజేశారు.