’ఫిదా’ చేస్తానంటున్న హరితేజ…

374
hari teja
- Advertisement -

హరితేజ.. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా పరిచయమైన అమ్మాయి.. ఆ తర్వాత యాంకర్ గా తన ప్రతిభను చాటుకుంది. ఆ తర్వాత వెండి తెర పైన కూడా మెరిసింది. అందరి బంధువయా, అనగనగా ఓ ధీరుడు, దమ్ము, దిక్కులు చూడకు రామయ్య, 1 నేనొక్కడినే, అత్తారింటికి దారేది, విన్నర్, దువ్వాడ జగన్నాథం, అ ఆ, ఉంగరాల రాంబాబు వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ ని పోషించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాలో మంగమ్మ పాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైంది హరితేజ.

hariteja

రీసెంట్ గా బుల్లితెరలో ప్రసారమైన బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఇంటి సభ్యురాలిగా ఉండి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 1 లో తానే విజేతగా నిలుస్తుందని, ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ, శివ బాలాజీ బిగ్ బాస్ విన్నర్ గా నిలవగా, హరి తేజ మూడో విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు హరితేజ యాంకర్ గా జెమినీ టీవీలో ఓ షో ప్రసారమవుతోంది. ఈ షోకు మంచు లక్ష్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మొదటి ఎపిసోడ్ రేపు ప్రసారం కాబోతోంది. షోకు మొదటి గెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ రానుంది. ఈ షోలో సెలెబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలను తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నారు. అయితే బిగ్ బాస్ క్రేజ్ తో ఈ ఫిదా షో ని హరితేజ తన మాటల గారడి, ఎనర్జీతో ఎంతవరకు సక్సెస్ చేస్తుందో చూడాలి.

- Advertisement -