- Advertisement -
ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ బాటలోనే స్టెప్పులతో అదరగొట్టాడు భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేస్తూ ఇరగదీశాడు. తన అమ్మమ్మతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు.
హార్దిక్ పాండ్యా అమ్మమ్మ ఈ స్టెప్పునేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని అల్లు అర్జున్‌కి ట్యాగ్ చేసిన హార్ధిక్… “మా స్వంత పుష్ప నాని” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
- Advertisement -