YSR:హ్యాపీ బర్త్ డే..రాజన్న

26
- Advertisement -

నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ వుండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు. అంద‌రూ రైతే రాజంటారు..స‌రైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచ‌రికం మాకొద్ద‌య్య‌..మ‌మ్మ‌ల్ని రాజులుగా కాదు క‌నీసం రైతులుగా బ్ర‌త‌క‌నివ్వండి చాలు..అని ప్ర‌తి రైతు గొంతెత్తి అరుస్తున్న స‌మ‌యం అది.. ఎవ‌రైనా ఆదుకుంటారా అని రైతన్న ఎదురుచూసిన స‌మ‌యం లో ఒక గొంతుక వినిపించింది.. నేను విన్నాను నేను వున్నాను అంటూ ఓ పిలుపు పేద ప్ర‌జ‌ల‌వైవు నిలుచుంది. నాయ‌కుడిగా మ‌న‌కు ఏం కావాలో తెలుసుకున్నాము కాని జ‌నానికి ఏం కావాలో తెలుసుకొలేక‌పోయాము అంటూ అదిష్టానాన్ని సైతం లెక్క‌చేయ‌క పేద ప్ర‌జ‌ల క‌ష్టాల్ని విన‌టానికి క‌డ‌ప గ‌డ‌ప దాటి ప్ర‌జాయాత్ర ని పాద‌యాత్ర గా ప్రారంభించిన జ‌న‌నేత‌గా , మ‌హ‌నేత‌గా పేద ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడుగా ఎప్ప‌టికి ప‌దిల‌మైన చోటు సుస్థిర‌ప‌రుచుకున్న మ‌హ‌నాయికుడు దివంగ‌త నేత‌ ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి .ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అని అంతా అనుకున్న వేళ రెండుసార్లు పార్టీని తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడమే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించారు. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..

వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగులో జయమ్మ,రాజారెడ్డి దంపతులకు జన్మించారు రాజశేఖర్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టారు.6 సార్లు పులివెందుల నుండి ఎమ్మెల్యేగా 4 సార్లు కడప నుండి ఎంపీగా గెలిచారు.

రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో కీలకఘట్టం పాదయాత్ర. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రచారం కాంగ్రెస్ విజయానికి బాటలు వేసింది. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద చేసి రైతన్నల మనసు గెలుచుకున్నారు రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు పనిచేశాడు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నాడు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.

పదవులు
1975: యవజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం.
1980: తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా నియామకం.
1982: రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖా మంత్రి పదవి లభించింది.
1982: రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం.
1983: పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు (1985 వరకు).
1998: రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియామకం (2000 వరకు).
1999: శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు.
2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
2009: రెండోపర్యాయం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.

Also Read:‘మిస్టర్ బచ్చన్’.. ఫస్ట్ సింగిల్

విజయాలు

1978: పులివెందుల నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందినాడు.
1983: పులివెందుల నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా విజయం.
1985: పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసనసభ్యుడిగా హాట్రిక్ విజయం.
1989: కడప నియోజకవర్గం నుంచి తొలిసారి లొకసభ సభ్యుడిగా విజయం.
1991: కడప నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపు.
1996:కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్ సాధించాడు.
1998: కడప నుంచి వరుసగా నాలుగవసారి ఎన్నికలలో విజయం సాధించాడు.
1999: పులివెందుల నుంచి నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపు.
2004: పులివెందుల నుంచి ఐదవసారి శాసనసభ్యుడిగా విజయసాధించాడు.
2009: పులివెందుల నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందడం ఆరవసారి.

- Advertisement -