సెల్యూట్‌ టూ రావి నారాయణరెడ్డి

57
- Advertisement -

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నైజాం అరాచాకాలపై గర్జించిన వీర యోధుడు, భూస్వామ్య వ్యవస్థ అంతమొందించే వరకు అలుపెరుగని పోరాటాలు చేసిన మహోన్నత వ్యక్తి,, గొప్ప సంఘ సంస్కర్త,తెలంగాణ సాయుధ పోరాటానికి ఆధ్యుడు. ఆయనే రావి నారాయణరెడ్డి. చేసాడని గుర్తు చేశారు.

రావి నారాయణరెడ్డి …జూన్ 5, 1908లో జన్మించారు. తెలుగుజాతి ఐక్యతను కోరుకొని విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించిన నిజమైన తెలుగువాది.నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం అవిస్మరణీయం.1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మత దురహంకారులైన రజాకార్ల ఉన్మాద ఆగడాలను అరికట్టడ్డడానికి గెరిల్లా పోరాటం చేసిన యోధుడు ఆయన.

Also Read:నిద్ర‌కు ముందు గ్రీన్ టీ తాగితే..?

1951-52లో తొలి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్థిగా నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి నాటి ప్రధాని నెహ్రు కంటే ఎక్కువ ఓట్లు సాధించి పార్లమెంటులో తొలి అడుగుపెట్టిన ఘనత రావి నారాయణరెడ్డి సాధించాడని చెప్పారు. తన 500 ఎకరాల సొంత భూములను పేదలకు దానం చేసి పేదలకు అండగా నిలిచారు.

1922-38 వరకు హైదరాబాద్ స్టేట్ హరిజన సేవక సంఘం కార్యదర్శిగా పనిచేశారు.ఆ సమయం లో వారి విద్యాబుద్దులకు 100 పాఠశాలలు ఏర్పాటు చేసిన దార్శనికుడు వారు.స్వయంగా గాంధీ, మావో, హోచిమిన్, కృశ్చేవ్‌లను కలిసిన సమరశీలి. ఒకసారి మహాత్మాగాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తన భార్య సీతాదేవితో వెళ్ళి కలిశారు. భార్య ఒంటిపై ఉన్న నగల న్నింటినీ గాంధీ చేతిలో పెట్టి, హరిజన సేవక సంఘానికి ఇవ్వమని చెప్పిన నిరాడంబరుడాయన.

Also Read:పర్యావరణ దినోత్సవం..గ్రీన్ ఇండియా ఛాలెంజ్
నిజాం అప్రజాస్వామ్య మతదురహంకార వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమంలో కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ అతి ఇప్పటికీ విశిష్టమైనది. 1975లో సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్‌దూమ్ భవన్ శంకుస్థాపనకు -ఆనాటి సీపీఐ చైర్మన్- ఎస్‌ఏ డాంగే వచ్చారు. 1991 సెప్టెంబర్ 7న రావి మరణించాడు. తన అస్థికలను గంగానదిలో కలపవద్దని, పొలంలో చల్లితే చాలనీ అన్నారు.

- Advertisement -