‘మజిలీ’ కోసం వెంకీమామ

271
majili venkatesh
- Advertisement -

పెళైన తర్వాత అక్కినేని నాగ చైతన్య సమంత కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ. ఈచిత్రాన్ని నిన్ను కోరి మూవీ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రం ఎప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈచిత్రం షూటింగ్ ఇటివలే పూర్తి చేసుకోని డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. ఇటివలే విడుదలైన మజిలీ ఆడియో సాంగ్ లు , టీజర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నాగ చైతన్య, సమంత ఇద్దరూ ఈసినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 30న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈవేడుకుకు నాగచైతన్య మామ, విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిధిగా రానున్నారు. రీసెంట్ గా కూతురు పెళ్లి చేసిన వెంకీ ఇక తన రెగ్యులర్ సినీ లైఫ్ లోకి రావడానికి సిద్దమవుతున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి వెంకీమామ అనే మల్టీస్టారర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభంకానుంది.

- Advertisement -