పవర్ అనే పదానికి అర్ధాన్ని వెతికితే ముందుగా కనిపించే పేరు పవన్. టాలీవుడ్ రికార్డుల్ని బద్దలుకొట్టాలన్నా కొత్త రికార్డులు తిరిగి రాయాలన్నా ఆ పవర్ ఉండాల్సిందే. కోట్లాది మంది అభిమానులు ఆయన పేరు చెబితే ఊగిపోతారు. ఎనలేని ఫాలోయింగ్ తో వెలకట్టలేని అభిమానంతో పవనిజం అంటూ చెలరేగిపోతారు. జయాపజయాలకు అతీతంగా, టాలీవుడ్ జెండా పై జెండాని ఎగరేసిన కాటమరాయుడు పుట్టినరోజు నేడు. పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది…
పవన్ కళ్యాణ్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్. టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే ఒక ఫైర్ బ్రాండ్. తన అరుదైన వ్యక్తిత్వంతో, అద్భుతమైన ఆలోచనలతో స్టార్ కథానాయకుడిగా టాలీవుడ్ టాప్ చెయిర్ మీద దర్జాగా కూర్చున్న ఆయనది పవర్ స్టార్ డమ్. పేరు ముందే పవర్ ని నింపుకున్న స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడిగా తెరంగేట్రం చేసినా, స్వశక్తితో తక్కువ టైమ్‌లో అంచలు అంచలుగా ఎదిగి పవర్ స్టార్‌గా అభిమానుల గుండేల్లో చెరగని ముద్రను వెసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ పిలుపే ఒక ప్రభంజనంలా అభిమానులు చేలరేగిపోతారు.
సాధారణమైన ఇమేజ్ తోనే వెండితెరమీద తెరంగేట్రాన్ని ప్రారంభించాడు. కేవలం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే ఫోకస్ అయిన పవన్ కళ్యాణ్, తనకున్న అసాధారణమైన టాలెంట్ తో క్రమేపి అభిమానుల్ని సంపాదించుకున్నాడు.గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ లాంటి ప్రేమకథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్, పూరీ బద్రి సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ కెరీర్ గ్రాఫ్ అంచెలంచెలుగా పెరిగింది. విభిన్నతరహా పాత్రలతో, విలక్షణమైన కేరక్టరైజేషన్స్ తో పవర్ స్టార్ వెండితెరమీద తన స్టామినాను చాటుకున్నాడు. అక్కడినుంచి ఆయన మేనరిజమ్స్ తో అభిమానులకి పవన్ మ్యానియా పట్టుకుంది.
Also read:జమిలి ఎలక్షన్స్.. అంతా చిక్కుముళ్లే!