కార్మిక సోదరులకు, శ్రామిక లోకానికి హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. మీ రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుంది, మీ త్యాగం వెలకట్టలేనిది అని ఎక్స్ వేదికగా తెలిపారు.
చారిత్రాత్మక మేడే స్పూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచింది… సింగరేణి శ్రామికులకు బోనస్‌లు, ఉద్యోగ భద్రత, మెరుగైన సౌకర్యాలతో గౌరవించాం అన్నారు. TSRTC కార్మికులకు జీత భత్యాల పెంపు, ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలతో భరోసా కల్పించాం…. ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులకు ఆర్థిక సహాయం, సంక్షేమ బోర్డులతో అండగా నిలిచాం అన్నారు.
తెలంగాణను పారిశ్రామిక ఆదర్శంగా నిలబెట్టి, లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించాం…మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచాం అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా, మీ హక్కుల కోసం నిరంతరం పోరాడతాం.. ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దాం అని పిలుపునిచ్చారు కేటీఆర్.
Also Read:మేడేనే కాదు గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం..

