హ్యాపీ బర్త్ డే…… చైతూ

257
nagachaitanya
- Advertisement -

నాగచైతన్య, సమంత జంట నటిస్తున్న ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివనిర్వాన దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్నటితో వైజాగ్‌తో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. రావు రమేష్‌, పోసాని కష్ణమురళి, సుబ్బరాజు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్‌ డ్రామాకు గోపీసుందర్‌ సంగీతం అందిస్తుండగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌లో సాహు గరపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చైతూ బర్త్ డే సందర్భంగా విషెస్‌ చెబుతు పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. నైంటీస్ లో కుర్రాళ్లు ఎలా ఉండేవారో గుర్తు చేస్తూ నాగచైతన్య వింటేజ్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ఫొటో చైతూ అభిమానులనే కాక, సినీ ప్రియులందరినీ ఎట్రాక్ట్ చేస్తూ వైరల్ అవుతోంది.

1986 నవంబరు 23న అక్కినేని నాగార్జున,లక్ష్మి (నటుడు వెంకటేష్ సోదరి)లకు జన్మించారు నాగచైతన్య. జోష్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చైతూ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏ మాయ చేసావే సినిమా ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. పమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో వీరిద్దరూ లవ్‌లో పడ్డారు.

2011లో సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్నారు. తర్వాత ‘ప్రేమమ్’ , ‘సాహసమే శ్వాసగా సాగిపో’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’,శైలజా రెడ్డి అల్లుడుతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చైతూ ఇలాంటి బర్త్ డే వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కోరుకుంటోంది.

- Advertisement -