సింగిల్ టేక్‌లో హ‌న్సిక ‘105 మినిట్స్’..

157
Hansika motwani
- Advertisement -

హీరోయిన్‌ హ‌న్సిక మోత్వాని..రీసెంట్‌గా 50 సినిమాల‌ను పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ చేతిలో మ‌రో రెండు ప్రాజెక్టులున్నాయి. ఇవి కాకుండా 53వ చిత్రంగా తెలుగులో ‘105 మినిట్స్’ అనే సినిమాలో న‌టిస్తోంది. రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక ముఖ్య పాత్రలో తెరకెక్కుతోంది. ఇండియన్ స్క్రీన్‌పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో చేస్తున్న సింగిల్ షాట్ చిత్రం ఇది.

ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మంగ‌ళ‌వారం స్టార్ట్ అయ్యింది. రాజా దుస్సా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఒకే ఇంట్లో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమా వ్య‌వ‌ధి కూడా 105 నిమిషాలే కావ‌డం విశేషం. మ‌రి సింగిల్ క్యారెక్ట‌ర్‌, సింగిల్ టేక్ మూవీలో హ‌న్సిక ఎలా మెప్పిస్తుందో చూడాలి.

- Advertisement -