గువ్వగోరికంతో లఘు చిత్రం ప్రదర్శన ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ లఘు చిత్రంలో వంశీ అలూర్, ధ్రితి త్రివేది హీరో, హీరోయిన్లగా నటించారు. ఈ లఘు చిత్రానికి కల్యాణ్.సి.బడుగు దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన రాజ్ కందుకూరి మాట్లాడుతూ “ 25 నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎనిమిది నిమిషాలు నన్ను ఎంతో గానే ఆకట్టుకుంది. దర్శకుడు కల్యాణ్ కు మంచి భవిష్యత్ ఉంటుంది` అన్నారు.
కేరింత ఫేం పార్వతీశం మాట్లాడుతూ ` ఈ చిత్రంలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. నన్ను పర్సనల్ గా ఆలోచింపజేశాయి` అన్నారు. డైరెక్టర్ కల్యాణ్ మాట్లాడుతూ ` ఈ మూవీని ఫ్యాషన్ తో డైరెక్ట్ చేశాను. మా ఈ ప్రయత్ననాన్ని అందరూ అదరిస్తారని కోరుకుంటున్నా` అన్నారు.