ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: గవర్నర్

195
Governor Tamilisai
- Advertisement -

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ విజృంబిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు వణికిపోతున్నారు. ఆదివారం నగరంలో మొత్తం 132 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. పంజాగుట్టలోని నిమ్స్‌ వైద్య సిబ్బంది ఇటీవల కరోనా బారిన పడిన నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఈరోజు నిమ్స్ హాస్పిటల్‌ను సందర్శించారు.

వారికి అందుతున్న వైద్యంపై ఆమె ఆరా తీశారు. నిమ్స్ ఆసుపత్రి వైద్యాధికారులతో ఆమె చర్చించారు. డాక్టర్లకు కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వాన్ని కోరతానని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

ఫ్రంట్ లైన్‌లో ఉన్న మెడికొలకు పాజిటివ్ రావటం బాధాకరం.ఒక డాక్టర్‌గా వాళ్ళను పరామర్శించాను. రిలాక్స్ఏషన్ వల్ల కేసులు పెరుగుతున్నాయి కానీ తప్పదు. నాన్ సింటమ్స్ పెరుగుతున్నారు.తెలంగాణ ప్రజలు జాగ్రత గా ఉండండి..ప్రభుత్వం మీతో ఉంది అని గవర్నర్ తెలిపారు. అలాగే కరోనా సోకి ఒక జర్నలిస్ట్ మృతి చెందగా.. జర్నలిస్ట్‌ మృతి పట్ల గవర్నర్ సంతాపం తెలిపారు.

- Advertisement -