తెలంగాణలో భారీ వర్ష సూచన..

385
heavy rainfall
- Advertisement -

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారీ వర్ష సూచనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా.. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకొని, ఈశాన్య జార్ఖండ్‌ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఒడిశా, ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తీర కర్ణాటక, ఉత్తర కొంకణ్ మరియు కేరళ, మహేలలో జూన్ 10-12 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.2.జూన్ 11-12 తేదీలలో ఉత్తర మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, విదర్భా, ఛత్తీస్‌గర్‌ మరియు దక్షిణ మధ్య ప్రదేశ్ మీదుగా భారీ వర్షపాతం నమోదైంది.

- Advertisement -