సభ సజావుగా సాగేందుకు సహకరించండి: గుత్తా

85
gutha

తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలోని చైర్మన్ ఛాంబర్ లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాసన మండలి బి ఏ సి సమావేశం జరిగింది.ఈ సమావేశానికి శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఛీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు,విప్ భాను ప్రసాద్, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, ఏం ఐ ఏం పార్టీ ఎమ్మెల్సీ జాఫ్రీ,తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రెటరీ డా” నర్సింహ చార్యులు గార్లు హాజరయ్యారు.

శాసన మండలి సమావేశాలు ఈ నెల 17, 18, 20,22,26 తేదీలలో నడపాలని బి ఏ సి సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ శాసన మండలి సమావేశాలు సజావుగా నడవడానికి అధికార ,ప్రతిపక్ష సభ్యులందరు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. సభలో చర్చలు విజయవంతంగా జరగడానికి పూర్తి సహకారం అందిస్తానని ఆయన చెప్పారు.