గుర్మిత్‌ సింగ్‌కు ఇన్ని ఆస్తులా..!

211
Gurmeet Ram Rahim Singh Propertys
- Advertisement -

అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నెల 28న శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు వెలువడిన వెంటనే గుర్మీత్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్మీత్‌ దోషిగా తేల్చడంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ముందస్తుగా ఆర్మీ రంగంలోకి దిగింది. కోర్టు ఆవరణలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయనను రోహ్‌తక్‌లోని జైలుకు తరలించారు.ఈ నేపథ్యంలో హరియాణాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Gurmeet Ram Rahim Singh Propertys

ఇప్పడు ఇంకో సాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే.. ‘డేరా సచ్చా సౌదా’ సంస్థకు ఉన్నఆస్తులను చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే! హర్యానాలో 1948లో మానవతా విలువల పరిరక్షణ పేరిట ‘డేరా సచ్చా సౌదా’ను స్థాపించారు. సిర్సా పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సంస్థను షాహ్ మస్తాన్ మహారాజ్ ప్రారంభించారు. ఆయన తాను బెలూచిస్తాన్‌లో అవతరించానని చెప్పేవాడు. ప్రజల్లో అంతరాలు తొలగించేందుకు ఆయన సంస్థకు ముందు ‘సచ్చా’ అనే పేరును జతచేర్చారు. ఆయన నిర్యాణం అనంతరం వారసునిగా షాహ్ సత్నామ్ సింగ్ మహరాజ్ 1960లో భాధ్యతలు చేపట్టారు. 1967లో జన్మించిన గురుమీత్ సింగ్ తన 23 సంవత్సరాల వయసులో సత్నామ్ సింగ్ మహారాజ్‌ను ఆశ్రయించారు. ఆయన మరణానంతరం సంస్థ గురుమీత్ సింగ్ చేతుల్లోకి వచ్చింది. ఈ నేపధ్యంలో సంస్థను గురుమీత్ సింగ్ మరింత ఆధునీకరించారు. ముందుగా ‘డేరా సచ్చా సౌదా’ కోసం అత్యాధునికి భవనాన్నినిర్మించి.. దీనిని కేంద్రంగా చేసుకుని వేలకోట్ల నిధులు సేకరించారనే ఆరోపణలున్నాయి.

Gurmeet Ram Rahim Singh Propertys

డేరా ఆధీనంలో ఉన్న ఆస్తిపాస్తులు.
1. ‘డేరా సచ్చా సౌదా’కు చెందిన పురాతన భవనం, ఏసీ మార్కెట్
2. డేరా నూతన భవనం.. దానిలో షాహ్ సత్నామ్ సింగ్ బిజినెస్ స్కూల్, షాహ్ సత్నామ్ సింగ్ గర్ల్స్ స్కూల్, సత్నామ్ సింగ్ గర్ల్స్ కాలేజీ, బిజినెస్ కాలేజీ
3. క్రికెట్ స్టేడియం
4. ఫైవ్ స్టార్ హోటల్
5. డేరా బాబా అంతరాలయం
6. ఎంఎస్ జీ ఇంటర్నేషనల్ స్కూల్
7. షాహ్ సత్నామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
8. వివిధ ఫ్యాక్టరీలు
9. ఎస్ఎంజీ ప్రొడక్ట్స్
10. ఫిల్మ్ సిటీ సెంటర్
11. మాహీ సినిమా
12. కషిష్ రెస్టారెంట్
13. ఆర్గానిక్ వ్యవసాయ పంటపొలాలు
14. డేరా శిక్షణ సంస్థలకు సంబంధించిన స్కూలు వ్యాను, ఇతర వాహనాలు
15 బాలికల హాస్టల్.

అంతే కాదు తెలంగాణా ఆంద్రలలో కూడా ఈ బాబాకి ఈస్తులు ఉన్నాయి. హైదరాబాద్ శివార్లలోని నల్గొండ జిల్లాలో పెద్ద‎ఎత్తున భూములను డేరాబాబా కొనుగోలు చేశాడు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన 50 ఎకరాలను 2008లో కొనుగోలు చేసిన డేరా బాబా తన స్థలం చుట్టూ భారీ ప్రహారీ గోడ నిర్మించాడు. 2008లోనే డేరా బాబా భూములను కొనుగోలు చేసినా ఇప్పటివరకూ ఎవరూ రాలేదని స్థానికులు అంటున్నారు. అయితే భూములు విలువైనవి కావడంతో 24గంటలూ సెక్యూరిటీ మాత్రం ఉంటుందని చెబుతున్నారు. రైతుల నుంచి డేరా బాబా అనుచరులు ఈ భూములను కొనుగోలు చేశారని కొన్నప్పుడే చుట్టూ భారీ ప్రహారీ గోడ నిర్మించారని స్థానికులు అంటున్నారు. హర్యానా – పంజాబ్ లను షేక్ చేస్తున్న డేరా బాబాకి తెలుగు రాష్ట్రాలతోనూ లింకులు ఉండటం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.

- Advertisement -