అవినాష్ రెడ్డి వెంటే.. సిబిఐ !

34
- Advertisement -

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి చుట్టూ రోజుకో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు మార్లు విచారణ ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి.. అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న ప్రతిసారి విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కు వెళ్ళడం, లేదా విచారణకు అందుబాటులో ఉండకపోవడం వంటివి చేస్తూ వచ్చారు. అయితే మరోవైపు జూన్ 30 నాటికి ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉండడంతో అటు సిబిఐ కూడా ఈ కేసును అంతా తేలికగా వదలడం లేదు. దీంతో సిబిఐ వర్సస్ అవినాష్ రెడ్డి చుట్టూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మొదట ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేయగా.. అవినాష్ రెడ్డి ఇతరత్రా కారణాల వల్ల హాజరు కాలేదు. దాంతో మరోసారి 19న హాజరు కావాలని సిబిఐ కోరగా.. అనూహ్యంగా అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు రావడంతో ఆయన విచారణకు హాజరు కాలేనని చెప్పారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సిబిఐ తప్పించుకునేందుకే అవినాష్ రెడ్డి ఆడిన నాటకం అని మరో వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ.. ఆయన తల్లి హెల్త్ బులిటెన్ పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడం, మీడియా కూడా కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం వంటి కారణాలు బలం చేకూరుస్తున్నాయి.

Also Read: ఆ నలుగురిపై బీజేపీ నజర్ ?

ఈ నేపథ్యంలో మరో తన తల్లి ఆరోగ్యం నిమిత్తం మరో 10 రోజులు అవినాష్ రెడ్డి గడువు కోరడంతో సిబిఐ టీం ఏకంగా కర్నూల్ చేరుకుంది. అంతే కాకుండా శాంతి భద్రతల విషయంలో తగు జాగ్రతలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని సిబిఐ కోరింది కూడా. దీంతో అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయబోతుందా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే భద్రత విషయంలో పోలీస్ బృందాల నుంచి సరైన అనుమతి లభించక పోవడంతో.. కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని సిబిఐ కేంద్రాన్ని కోరింది. దీంతో కర్నూల్ లో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకే సిబిఐ సిద్దమైందా ? లేదా కర్నూల్ లోనే అవినాష్ రెడ్డిని విచరిస్తుందా ? ఇంతకీ సిబిఐ తరువాత ఏం చేయబోతుంది అనేది అత్యంతా ఆసక్తికరంగా మారింది.

Also Read: ‘మీటింగ్ టైమ్’ బీజేపీలో కలవరం పోతుందా?

- Advertisement -