గుజరాత్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఇస్‌దాన్ గాధ్విని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇస్‌దాన్ గాధ్వి ఖంభాలియా నుంచి బరిలోకి దిగుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే అహిర్ విక్రమ్ భాయ్ అర్జన్‌భాయ్ మేడమ్ మరియు బీజేపీ నంచి మాజీ మంత్రి ములుభాయ్ బేరా పోటిలో నిలిచారు.
గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలోని ఖంభాలియా సమీపంలోని పిపాల్య గ్రామంలో జన్మించిన ఇసుదాన్ గాధ్వి.. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. జామ్‌నగర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. అనంతరం జర్నలిజంలో వృత్తిని ఎంచుకుని అహ్మదాబాద్‌లో పనిచేవారు. 2021 జూన్‌లో గోపాల్ ఇటాలియా పిలుపుమేరకు ఇసుదాస్ గాధ్వి ఆప్‌లో చేరారు.
ఖంభాలియా నియోజకవర్గం నుంచి ఇసుదాస్ గాధ్వి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ప్రకటన చేశారు. ‘రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, వ్యాపారవేత్తల కోసం ఏండ్ల తరబడి తన గళం వినిపించిన ఇసుదన్ గాధ్వి జామ్ ఖంభాలియా నుంచి పోటీ చేస్తారు. శ్రీకృష్ణుడి పవిత్ర భూమి నుంచి గుజరాత్ కొత్త, మంచి ముఖ్యమంత్రి వస్తున్నారు’ అని ట్విట్టర్‌లో రాశారు.
ఇవి కూడా చదవండి..