షాకింగ్..మార్కెట్లో 56 శాతం రూ. 2వేల దొంగనోట్లు!

510
gujarath
- Advertisement -

నల్లధనాన్ని వెలికితీసే పేరుతో పెద్దనోట్లు రూ. 500,రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి బదులు రూ. 2000ల నోటును చలామణిలోకి తీసుకొచ్చింది. అంతేగాదు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఫీచర‍్లతో రూ. 2 వేల నోటును తీసుకొచ్చినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది.

రూ.2వేల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తేలింది. దేశంలో హల్‌ చల్‌ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని రికార్డుల ద్వారా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం రూ.2వేల నోట్లు ఉన్నాయని సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో 56 శాతం రూ. 2వేల నకిలీ నోట్లు ఉన్నాయని.. మోడీ సొంతరాష్ట్రం గుజరాత్‌ ఫేక్‌ కరెన్సీ అడ్డాగా మారిందని తెలుస్తోంది. అంతేగాదు ఎక్కువ శాతం నకిలీ కరెన్సీ గుజరాత్‌లోనే పట్టుబడటం విశేషం.

- Advertisement -