మోడీ మెచ్చిన..నోట్ల దొంగ

467
abhinav_fake
- Advertisement -

ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.. మేకిన్‌ ఇండియాలో భాగమై యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని ప్రశంసలు పొందాడు. కానీ.. నకిలీ నోట్ల రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయి అపఖ్యాతిని మూటకట్టుకున్నాడు. మేకిన్‌ ఇండియాలో భాగంగా తాను రూపొందించిన పరికరానికి గాను గతేడాది ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు పంజాబ్‌కు చెందిన ఇంజినీరు అభినవ్‌ వర్మ (21).

ఆ అభినవ్‌ వర్మే నేడు పంజాబ్‌లోని మొహాలీలో రూ.45 లక్షల నకిలీ కరెన్సీని తరలిస్తుండగా.. బృందంతో సహా అడ్డంగా దొరికిపోయాడు. నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన నగదు కొరతను దృష్టిలో ఉంచుకుని పెద్దఎత్తున నకిలీ 2000 నోట్ల ముద్రణకు పూనుకున్నాడు. దాన్ని పాత 500, 1000 నోట్లతో మార్పిడి చేసుకునేందుకు 30శాతం కమిషన్‌ తీసుకుంటున్నాడు. గుట్టుగా ఈ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో పెద్దఎత్తున నగదును బుగ్గ కారులో అక్రమంగా తరలిస్తుండగా పంజాబ్‌ పోలీసులు పట్టుకున్నారు.

abhinav_fake

అభినవ్‌తో పాటు అతడి సోదరుడు విశాఖ వర్మ, లూధియానాకు చెందిన సుమన్‌ గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. ఈ ముఠాకు సంబంధమున్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని మొహాలీ ఎస్పీ పర్మీందర్‌ సింగ్‌ తెలిపారు.

abhinav_fake

మోదీ ఎందుకు మెచ్చుకున్నారు..
అభినవ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. అంధులు ఉపయోగించే కర్రలలో ఏర్పాటుచేయడానికి ఉపయోగపడే సెన్సర్లను అతడు తయారుచేశాడు. వాటి సాయంతో అంధులు కర్రకు ముందు ఏముందో కూడా తెలుసుకోవచ్చు. గోతులు గానీ, రాళ్లు గానీ ఏవైనా అడ్డం వస్తే ఈ సెన్సర్ గుర్తించి అలారం మోగిస్తుంది. ఆ ఆవిష్కరణ చేసినందుకు మోదీ ఇతడిని జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభలో అభినందించారు. కానీ, చండీగఢ్‌లోని తన కార్యాలయంలో ఇప్పుడు అతడు నకిలీ 2000 నోట్లను మాత్రమే తయారుచేస్తున్నాడని, సెన్సర్లు తయారుచేయట్లేదని పోలీసులు చెప్పారు.

- Advertisement -