- Advertisement -
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణలు రావడంతో ఆమెపై అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది.
అయితే ఆమె ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం. చిట్‌ఫండ్ కంపెనీలు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్ కంపెనీలతో పాటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీల్లోనూ ఉదయం నుంచి డీజీజీఐ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. లావణ్య త్రిపాఠి తెలుగులో ఇటివలే అర్జున్ సురవరం అనే సినిమాలో నటించగా… ఈమూవీ మంచి విజయాన్ని సాధించింది.
- Advertisement -