చాగంటిని గౌరవిస్తే మనకు మనం గౌరవించుకున్నట్లేః సీఎం కేసీఆర్

455
cmkcrchaganti
- Advertisement -

చాగంటిని గౌరవిస్తే మనకు మనం గౌరవించుకున్నట్లే అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో చాగంటి కోటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమానికి సీఎం దంపతులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా చాగంటి సీఎం కేసీఆర్ ను శాలువాతో సత్కరించారు.

ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘చాగంటి కోటేశ్వరరావు గొప్ప ప్రవచనకర్త. ఆయన మానవ జాతికి దొరికిన మణిపూస’ అని అన్నారు. నాకు కూడా భాగవత సప్తాహం వినాలని కోరిక. భగవంతుని గురించి చదివినా, విన్నా గొప్ప పుణ్యం లభిస్తుంది. గజేంద్రమోక్షం లాంటి ఘట్టాలు చాలా సందర్భాల్లో కనిపిస్తాయి. భగవంతుని కరుణ మనకు కలగాలంటే లీనమై వినాలి. ఆధ్యాత్మికత అలవరచుకుంటే శాంతి, సౌభాగ్యం లభిస్తుంది. రోజురోజుకు మానవ ప్రవృత్తి మారుతోంది. ఎక్కడకెళ్లినా రాని క్రమశిక్షణ గుడికెళ్తే వస్తుందని’ కేసీఆర్‌ తెలిపారు.

- Advertisement -