- Advertisement -
దక్షిణ తెలంగాణ సాగునీటి వరప్రదాయిని అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రెండో దశ అటవీ అనుమతులు మంజూరయ్యాయి. పాలమూరు ప్రాజెక్టుకు అటవీ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ..తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. ప్రాజెక్టుకు అటవీ అనుమతులు రావడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వడంలో సహాయమందించిన కేంద్ర మంత్రి హర్షవర్థన్ కు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. అటవీశాఖ అనుమతులు సాధించేందుకు కృషి చేసిన తెలంగాణ సాగునీటి,అటవీశాఖ అధికారులను సిఎం కెసిఆర్ అభినందించారు.
- Advertisement -