బ్యాంకాక్‌లో ప్రధానికి ఘనస్వాగతం

0
- Advertisement -

బ్యాంకాక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాతం లభించింది. రెండు దేశాలు థాయ్‌లాండ్, శ్రీలంకలో ప్రధాని పర్యటించనున్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే మోడీకి ఘనస్వాగతం లభించింది.

థాయ్‌లాండ్ అధికారులతో పాటు భారతీయులు భారీ స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు థాయ్‌లాండ్‌లో మోడీ పర్యటించనుండగా థాయ్‌లాండ్‌లో 6వ బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొన్నారు. థాయ్‌ ప్రధాని పేటోంగ్‌టార్న్‌ షినవత్రాతో కూడా భేటీ అయి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

ఇక సాయంత్రం బిమ్‌స్టెక్‌ సదస్సులో మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్‌ దేశాల అధినేతలు పాల్గొననున్నారు. ఈ సదస్సులో సాంకేతిక, ఆర్థిక సహకారంపై చర్చించనున్నారు.

Also Read:హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ..రెడ్ జోన్ ప్రాంతాలివే

- Advertisement -