- Advertisement -
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం విరాళాన్ని ప్రకటించింది. రామమందిర నిర్మాణ ట్రస్ట్ కోసం ఒక రూపాయి విరాళాన్ని ప్రకటించింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం తరపున హోంశాఖ కార్యదర్శి ట్రస్టు సభ్యులకు ఈ విరాళాన్ని అందజేశారు.
అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది. ఇక్కడ రామమందిర నిర్మాణం కోసం ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ఓ ట్రస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా ప్రముఖ న్యాయ నిపుణుడు పరాశరన్‌ను నియమించగా, ఇందులో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. ఒక దళితుడు శాశ్వత సభ్యుడిగా కొనసాగనున్నారు. రామమందిర నిర్మాణం కోసం ఎవరైనా విరాళాలు నగదు, ఆస్తుల రూపంలో అందజేయవచ్చని, వీటిని ఎలాంటి షరతులు విధించకుండా స్వీకరిస్తామని ట్రస్టు తెలిపింది.
- Advertisement -