మాఫియా డాన్ గా మహేశ్ బాబు!

416
Mahesh Babu
- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హ్యాట్రిక్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రష్మీక మందన హీరోయిన్ గా నటించింది. సరిలేరు నీకెవ్వరు మూవీ సక్సెస్ తర్వాత కొద్ది రోజులు కుటుంబ సభ్యులతో కలిసి ఫారిన్ కు వెళ్లిన మహేశ్ తిరిగి నిన్న హైదరాబాద్ కు వచ్చారు.

కాగా మహేశ్ బాబు తర్వాతి మూవీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. త్వరలోనే ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలుస్తుంది. ఈమూవీ మాపీయా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని సమచారం. మార్చి మొదటి వారం నుంచి ఈమూవీ షూటింగ్ ప్రారంభంకానుంది. వంశీ పైడిపల్లి మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన మహర్షి చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో భారీ అంచానాలు నెలకొన్నాయి.

- Advertisement -