శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా గోటబయ రాజపక్స..

511
Gotabaya Rajapaksa
- Advertisement -

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద్ర రాజపక్స సోదరుడు గోటబయ రాజపక్స విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. కౌంటింగ్ ప్రతిదశలోనూ రాజపక్స తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై పైచేయి సాధించారు.

పోలింగ్‌లో సుమారు 80శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగోవంతు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రేమదాసకు 45.3%, రాజపక్సేకు 48.2% ఓట్లు వచ్చాయని ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులు పేర్కొన్నారు. మొత్తం పోలైన ఓట్లలో తమకు 53-54% ఓట్లతో వస్తాయని ఆశిస్తున్నట్లు రాజపక్సే ప్రతినిధి వెల్లడించారు.

srilanka

దేశ ప్రజల తీర్పును గౌరవిస్తున్నాను. ఎన్నికల్లో శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన గొటబయా రాజపక్సేకు హృదయపూర్వక శుభాకాంక్షలు. అని ప్రేమదాస ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు ఫలితాలు అధికారికంగా విడుదల చేస్తామని ఎలక్షన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ పేర్కొన్నారు.

గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన గోటబయ రాజపక్స 2009లో ఎల్‌టీటీఈని నిర్మూలించి 26 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరదించినందకు ‘జాతీయ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. 1.6 కోట్ల మంది ఓటర్లున్న నేటి ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేయడం ఓ విశేషం.

- Advertisement -