నో డౌట్.. ‘చరణ్’కి గిట్టుబాటే !

27
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – విజువల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘RC 15’. కొద్ది రోజుల క్రితం వరకు ‘RC 15’ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఈ సినిమా పై చాలా గ్యాసిప్ లు పుట్టాయి. వాటన్నింటికీ ఎప్పటికప్పుడు దిల్ రాజు టీమ్ ఫుల్ స్టాప్ పెడుతూనే వస్తోంది. అయితే, చాలా కాలం నుంచి ఓ అంశం మాత్రం ముగిసేలా కనిపించడం లేదు. ఈ సినిమాకు గానూ రామ్ చరణ్ కి దిల్ రాజు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నాడు ? అన్నది పాయింట్. పైగా ఆర్ఆర్ఆర్ లాంటి ఆల్ ఇండియా సూపర్ హిట్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇది. మరి అలాంటప్పుడు రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉంటుంది ?,

ఇంత.. అంత అంటూ రకరకాల ఫిగర్లు అయితే ఇప్పటికే చాలా వినిపించాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 70 కోట్లు అని పక్కాగా వినిపించింది. మళ్లీ అంతలోనే కాదు, 80 కోట్లు పైగానే అని కూడా వినిపించింది. అసలు ఇప్పటి వరకు శంకర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ రెమ్యూనరేషన్ డిస్కషనే జరగలేదనీ అంటున్నారు. గతంలో ఐతే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 41…44…51 ఇలా వుంటూ వచ్చింది. ఈ సారి 65 కి కాస్త ఇటు అటుగా వుంటుందని అంటున్నారు. కానీ, ఇప్పుడు రెమ్యూనరేషన్లు బాగా పెరిగాయి. అందువల్ల రామ్ చరణ్ కి రెమ్యూనరేషన్ పెరిగే ఉంటుంది.

అందుకే, మెగా అభిమానులు తమ హీరోకి 80 కోట్ల పైమాటే తప్ప లోపు కాదని గట్టిగా వాదిస్తున్నారు. కానీ, ఇవేవీ నిజం కాదు. విజువల్ డైరెక్టర్ శంకర్ సినిమాకు గానూ రామ్ చరణ్ షేర్ తీసుకుంటున్నాడని.. నిర్మాత దిల్ రాజు కూడా చరణ్ కి ఇంత రెమ్యూనరేషన్ అని కాకుండా.. లాభాల్లో గుడ్ షేర్ ఇస్తా అని అగ్రిమెంట్ చేసినట్లు తెలుస్తోంది. చరణ్ – శంకర్ సినిమా టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ 250 కోట్లు దాటేస్తుందని అంచనా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తోన్న సినిమా కాబట్టి.. శంకర్ సినిమాకి 300 కోట్ల మార్కెట్ జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఏ రకంగా చూసుకున్నా.. చరణ్ కి ఈ సినిమా వల్ల బాగానే గిట్టుబాటు అవుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -