సంక్రాంతి సినిమాకి డార్లింగ్ సపోర్ట్

31
- Advertisement -

సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ బేనర్ పై అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన కళ్యాణం కమనీయం సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14న రిలీజ్ అవుతుంది. బాలయ్య ‘వీర సింహా రెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మధ్య సంక్రాంతి రేస్ లో నిలిచిన ఈ చిన్న సినిమాకు డార్లింగ్ సపోర్ట్ దక్కింది.

రీసెంట్ గా అనుష్క ఈ సినిమా ట్రైలర్ ను డిజిటల్ లో రిలీజ్ చేసింది. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో వెడ్డింగ్ ఆంతెం సాంగ్ రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సాంగ్ లాంచ్ ద్వారా సంక్రాంతి చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తున్నాడు డార్లింగ్. సంతోష్ శోభన్ హీరోగా చేస్తున్న మూవీ, పైగా సొంత బేనర్ యూవీ సంస్థ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఆటోమేటిక్ గా ప్రభాస్ సపోర్ట్ కళ్యాణం కమనీయం కే ఉంటుంది.

ఇప్పటికే దర్శకుడు శోభన్ గారి అబ్బాయి సంతోష్ శోభన్ నటించిన కొన్ని సినిమాలను ప్రమోట్ చేసి బెస్ట్ సపోర్ట్ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. ఇప్పుడు మరోసారి కళ్యాణం కమనీయం కి సపోర్ట్ అందిస్తున్నాడు. వెడ్డింగ్ మీద వచ్చే ఈ సాంగ్ ను కావాలనే ప్రభాస్ తో రిలీజ్ చేయించినట్టున్నారు యూనిట్.

ఇవి కూడా చదవండి…

‘వీరసింహారెడ్డి’ మాస్ మొగుడు సాంగ్

‘వారసుడు’ కు క్లీన్ యు

సూపర్ స్టార్ తో ఆ కుర్ర దర్శకుడు!

- Advertisement -