సూపర్ స్టార్ తో ఆ కుర్ర దర్శకుడు!

45
- Advertisement -

ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో జీవితంలో ఒక సినిమా అయినా చేయాలని దర్శకులంతా కలలు కంటూ ఉంటారు. లవ్ టుడే దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కి కూడా ఆ కల ఉంది. ఎలాగూ రజనీకాంత్ కి వయసు మీద పడినా వన్ బై వన్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. అయితే యంగ్ దర్శకులతో రజనీకాంత్ సినిమా అన్నది చాలా కాలంగా సాధ్యపడడం లేదు. ఇప్పుడు ఆ అవకాశం కాస్త కనిపిస్తోంది. యువ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ చెప్పిన లైన్ సూపర్ స్టార్ కి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. అయితే అంత మాత్రం చేత సినిమా అదిగో అని ఫిక్స్ అయిపోనక్కరలేదు.

ఎందుకంటే రజనీకాంత్ కి కథ చెప్పడం దగ్గర నుంచి ఆయనతో సినిమా స్టార్ట్ కావడానికి మధ్య చాలా అంటే చాలా వుంటుంది. అయితే ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే ఈ మధ్యనే లవ్ టుడే సినిమాతో దర్శకుడిగా ప్రదీప్ రంగనాథన్ ఫుల్ మార్క్ లు కొట్టేశాడు. పైగా లవ్ టుడే సౌత్ పాన్ ఇండియా సినిమాగా సూపర్ హిట్ అయింది. ఆ హిట్ ఉత్సాహంతోనే ప్రదీప్ రంగనాథన్ నేరుగా రజనీకాంత్ కే కథ చెప్పేశారు. లైన్ బాగుందని సూపర్ స్టార్ కూడా మెచ్చుకున్నారు.

ఎలాగూ వెనుక ప్రదీప్ రంగనాథన్ కి సూపర్ హిట్ సినిమా ఉంది. అలాగే ప్రదీప్ రంగనాథన్ చెప్పిన కథ రజనీకాంత్ కి బాగా నచ్చింది. కాబట్టి. ఈ కలయికలో సినిమా పక్కా అంటూ వార్తలు వస్తున్నాయి. ఐతే, ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ముందుగా రజనీకాంత్ మూడు సినిమాలు పూర్తి చేయాల్సిన కమిట్ మెంట్ వుంది. మరీ, ఇవన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత రజినీకాంత్ మీద ఉన్నప్పుడు.. ఇక సూపర్ స్టార్, ప్రదీప్ రంగనాథన్ కు ఛాన్స్ ఎలా ఇవ్వగలడు ?. కానీ.. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 2024 లో సూపర్ స్టార్ తో ప్రదీప్ రంగనాథన్ కి సినిమా ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -