అండగా నేనుంటా..ఎంపీ సంతోష్‌

64
- Advertisement -

నిరుపేద కుటుంబం నుంచి ఉన్నత స్థానానికి ఎదగడం అంటే ఎంతో శ్రమ పట్టుదల చాలా అవసరం…. అందుకు తగ్గట్టుగానే ఆర్థికంగా కలిగి ఉండాలి. అలాగని అందరికి ఆర్థికంగా ఉన్నావారు సాధించాలంటే కూడా చాలా కష్టం…అలాంటి కష్టం విలువ తెలిసిన బీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన బానోతు వెన్నెలకు ఆర్థిక సహాయం ప్రకటించారు.

చిన్న చిన్న కొండలు గుట్టలు ఎక్కడం చాలా సులువు అలాగే ఎత్తైన పర్వతం ఎక్కాలంటే అంత సులభం కాదు. అలాగని దుర్లభం కూడా కాదు. కృషితో నాస్తీ దుర్భిక్షం అని పెద్దలు ఉరకనే అనలేదు. అలాగని దానికి కొంతమంది మినహాయింపు కూడా కాదు. ఇందుకు ఉదాహరణే..బానోతు వెన్నెల.

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం సోమవారం పేటకు చెందిన గిరిజన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి…టాంజానియాలోని కిలిమంజారో 5895మీటర్ల ఎత్తైన పర్వతాన్ని ఈ నెల 19న అధిరోహించనుంది. ఈసందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌ను మంగళవారం ప్రగతి భవన్‌లో కలిశారు. బానోతు వెన్నెలకి ఎంపీ సంతోష్‌కుమార్‌ రూ. 3,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ…వెన్నెలను అభినందిస్తూ..భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ సందర్భంగా బానోతు వెన్నెలకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. తన వంతు సహాయంగా రూ.3,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

గ్రీన్ ఛాలెంజ్‌లో జోడి మెకే..

ఉత్తర భారతదేశాన్ని వణికిస్తోన్న చలి..

మస్క్‌ చెత్త రికార్డు.. 16 లక్షల కోట్లు లాస్

- Advertisement -